అత్త ,
ఆ పిలుపుకు అర్ధం నువ్వు ,
అలుపెరుగని జీవం నీవు ,
నీ జ్ఞాపకాలు మిక్కిలి పదిలం ,
నీ పయనం బహు సంక్లిష్టం.
నీ రూపం గాంభీర్యం ,
నీ మాట బంగారు మూల్యం ,
నీ మనసు మహాసముద్రం ,
వెలకట్టలేని నీ గౌరవం ఓ మహావృక్షం.
నీ జీవితం నాకో కధనం ,
పదే పదే చేస్తాను కంటస్థం ,
నీ శౌర్యం నా బలం ,
నా వెంటే వుంటుంది కలకాలం.
అత్తా ,
నీతో పలుమార్లు మాట్లాడాలని ,
నువ్వు త్వరగా కోలుకోవాలని ,
నీ సంతోషానికి హద్దులు ఉండకూడదని ,
మనసారా ఆశిస్తూ.
నీ ,
మేనల్లుడు
ఆ పిలుపుకు అర్ధం నువ్వు ,
అలుపెరుగని జీవం నీవు ,
నీ జ్ఞాపకాలు మిక్కిలి పదిలం ,
నీ పయనం బహు సంక్లిష్టం.
నీ రూపం గాంభీర్యం ,
నీ మాట బంగారు మూల్యం ,
నీ మనసు మహాసముద్రం ,
వెలకట్టలేని నీ గౌరవం ఓ మహావృక్షం.
నీ జీవితం నాకో కధనం ,
పదే పదే చేస్తాను కంటస్థం ,
నీ శౌర్యం నా బలం ,
నా వెంటే వుంటుంది కలకాలం.
అత్తా ,
నీతో పలుమార్లు మాట్లాడాలని ,
నువ్వు త్వరగా కోలుకోవాలని ,
నీ సంతోషానికి హద్దులు ఉండకూడదని ,
మనసారా ఆశిస్తూ.
నీ ,
మేనల్లుడు
No comments:
Post a Comment