Wednesday, April 24, 2013

Telugu Poem 12: Neekosam Vechesthu

నా జీవితంలో కళ తెచ్చి ఇట్టే జారిపోయావు ,
జనసంద్రంలో ఉన్నా నీ రూపం మరువలేక ,
నీవే కావాలని తపిస్తుంది నా మనసు పలుమార్లు ,
నీ అడుగులో అడుగు వేయాలి అని ఆకాంక్షిస్తూ ,
హృదయంలో బాధను భరిస్తూ ,
కొండ లాంటి ఈ ప్రేమను కుదిస్తూ ,
నింగి లాంటి నీ మనస్సులో చేరాలని ఆశిస్తూ ,
రామ మంత్రం వలె నీ నామం జపిస్తూ ,
నీ నుదుట బొట్టు పెట్టాలని కాంక్షిస్తూ ,
పొంగే కాలువలా నీకు ఆనందాన్ని కల్పిస్తూ ,
నా ఈ జీవితం నీకు అంకితం చేద్దామని వేచేస్తూ ----------------- సతీష్ 

No comments:

Post a Comment