Wednesday, April 24, 2013

Telugu Poem 9: Neevay Naa Baatasaari

మన పరిచయం ఓ తియ్యని కావ్యం లాంటిది ,
పలుమార్లు తపిస్తూ ,
మనసులో పదిలంగా ఉంచా ,
మరువలేని గుర్తులు ఎన్నో,
జీవం లేని ఈ జీవికి జీవం పోసి ,
రాతి లాంటి ఈ గుండెను కరిగించి ,
రంగం లోకి దించావ్ ,
మన ఈ పయనం మొదలై షుమారు రెండు వర్షాలు ,
పదమూడు నెలల మన మొదటి పరిచయం ,
ఇట్టే ఆపితిని నీ గురించి తపించి ,
ఆవేదనకు గురి చేసాను నీ స్వచమైన మనసును,
అనుభవించావు క్రమం తప్పకుండా మరు నాలుగు మాసాలు ,
ఇట్టే వచ్చెను ఓ మలుపు ,
దారులు వేరయ్యై సమయం ఆసన్నమాయె ,
ఒక వైపు నేను ,
మరొకవైపు ఓ కొత్త బాటసారి ,
నాదారి ఇంకా ముళ్ళ మయం ,
నీ సంయమనం , నా ఆగని పయనం ,
మలుపుకు సిద్ధం అయ్యావ్ ,
మన ఒక దారి ఇట్లే చేలిపోయే ,
నీ కొత్త పయనం మొదలాయే ,
నా మనస్సు ముక్కలాయే ,
ఐనా నా పయనం ఆపలేదే ,
వారాలు గడిచే ,
మాట కరువాయే ,
గుండె బరువు పెరిగాయే ,
పయనం పలుమార్లు స్తంభించే ,
మనసులో ఆలోచన మొలకించే ,
చివరికి నీవే నా బాటసారి అని కళ్ళు తెరిచె ,
మడమ తిప్పి పరుగు మొదలపెట్టే ,
నిన్ను చేరేలోపే నీ మనసు మారిపోయే ,
నా ఈ పయనం అన్నాచ్చిన్నమాయే ----------------------సతీష్ 

No comments:

Post a Comment