Wednesday, April 24, 2013

Telugu Poem 13: Ee Kaavyam Neekosam

నీ కోసం జపించి జపించి ఋషినయ్యా ,
నీ కోసం స్వరించి స్వరించి మూగబోయా ,
నీ కోసం వేచేసి వేచేసి అలసిపోయా ,
నీ కోసం వెతికి వెతికి సన్నగిల్లిపోయా.

నీ రూపం చూచి చూచి అంధుడినయ్యా ,
నీ మాట విని విని చెవిటివాడినయ్యా ,
నీ వంట తిని తిని రుచి మరిచిపోయా ,
నీ స్పర్స తగిలి తగిలి వికసించిపోయా.

నీ వెంట తిరిగి తిరిగి అవిటి వాడినయ్యా ,
నీ శిల్పం చెక్కి చెక్కి చిక్కిపోయా ,
నీ ఆట ఆడి ఆడి ఆవిరినైపోయా ,
నీ జీవితంలో కాంతి చిందిస్తూ ,
కరిగిపోతూ రాసిన  ఈ కావ్యం నీ కోసం -------------------- సతీష్ 

No comments:

Post a Comment