Monday, October 8, 2012

Telugu Poem 2: "Kopam"

నీ కోపం ప్రళయం,
ఇట్టే కనుమరుగైపోతుంది నీ చిలిపితనం,
ఆలోచన సన్నగిల్లుతుంది నీ ప్రతి నోటి మాటన,
ద్వేషంకి మొలక పడుతుంది కన్ను చాటున,
మస్తిష్కం ప్రతిబ్రమిస్తుంది చెడు మాటలతో,
తియ్యని మాట తలంపుగా వినిపిస్తుంది,
రెప్ప పాటులో 'ప్రేమ' అనే మాట కాంతి వేగంతో దూరమైపోతుంది,
సహజంగా చేలించే మనసు రాతిలా రూపు మారుతుంది,
గుండె చప్పుడు శంఖంలా ప్రతిధ్వనిస్తుంది,
ఆలస్యం కాకముందే,
మనసు చేలించటం ఆగకముందే,
ఇంకో మాట జారకముందే,
దూరం పెరగకముందే,
కళ్ళు చమర్చటం మరువకముందే,
వదిలేయ్,
కోపం వదిలేయ్.

No comments:

Post a Comment