Monday, October 8, 2012

Telugu Poem 4: "Ooo Chitti Kaavyam"


రోజుకి పలుమార్లు పలకరించే నా ప్రేయసికి తన్మయంతో రాసిన ఈ చిట్టి కావ్యం :- అక్టోబర్ 25, 2008.

నీ కోసం గడిపిన నిద్రలేని రాత్రులు ఎన్నో నా జీవితంలో,
ఎన్నేళ్ళైనా జీవించగలను ఆ నాటి స్మృతులతో,
అవి అనేకం, ఆనందమయం, అమాంతం అయోమయం,
లెక్కకు లేని గుర్తులు, 
కాలం అనే సునామిని చేధిస్తూ,
పదిలంగా  ఉంచాను ఆనాటి మధుర క్షణాలు,
ప్రతి క్షణం మధురం, ఆస్వాదిస్తా నా తుదివరకు,
నిన్నేనా అని తపించే ఆ అమృత ఘడియాలు,
గడచి పలు కాలాలు,
అయినా అవి మిక్కిలి పదిలం, ఆద్యంతం మధురానిభూతమ్,
గడిపాను ఘడియాలు నిమిషాలుగా , 
వేచేసాను నీ రాక కోసం నిద్రించే నయనాలతో,
పులకరించెను నా మనసు నీ రాకతో,
మరచితిని పడిన ఆవేదన, స్వచ్చమైన నీ చూపుతో,
అగ్గిగా ఉన్న వాడిని ఇట్టే మార్చావు నీ స్పర్శతో,
ఆ అగ్గి నుంచి ప్రేమని పుట్టిచ్చావ్ , అది చాలు ఈ రేయికి,
ఎన్నైనా చాలవు ఆ తీపి జ్ఞాపకాలు,
ఆరాటం ఆవేసమయం, తీరే వరకు కాదు మనసు ప్రశాంతం,
అలాంటి వాటిలో ఇది ఓ మచ్చుతునక,
ఆశించి, శాసించి, చివరికి ఒప్పించగాలిగాను ఓ మారు,
అడిగితిని అలిసే వరకు అయినా కలిగెను ఫలితం శూన్యం,
ఆమె నిట్టూర్పు అసాధారణం, నా సంకల్పం అసామాన్యం,
మౌనం కలిపెను మనసులు, ఇట్టే తెలిపెను తన అంగీకారం,
నా మనసు ఉప్పొంగెను పలుమార్లు, అది అమాంతం దాటెను ఖండ ఖండాలు,
మల్లెపువ్వు లాంటి స్వచమైన తన మనసుతో, ఆకర్శించెను ఈ కఠిన మూర్ఖుని,
మార్పు సహజం, నా మార్పుకు కేంద్రబింబం నివ్వే ఓ మధుమతి,
చేసావు నన్ను ఒక మనిషిని, ఎప్పటికైనా మరువజాలను నీ తీపి కలయిక,
గవ్వలో దాచి ఉంచుతా ప్రతి క్షణం, గుర్తుగా ఉండేలా కలకాలం,
తలవని క్షణాలు తక్కువ, కానీ, గడిపాను వాటిని యుగాలుగా,
నీ ఆకారం మరువక కష్టం, నిను మారుమారు చూసేవరకు,
భరిస్తాను ఈ కష్టం మిక్కిలి ఇష్టంతో........సతీష్  

No comments:

Post a Comment