Monday, October 8, 2012

Telugu Poem 5: "Mymarapinchay Andam"


మైమరపించే అందం ఎదురైతే మనసుకి మత్తు సహజం,
చిరునవ్వులు చిందించే ఆ చిన్నారి చిలిపి పలుకులు అమృతం,
ఆ మగువ కళ్ళు చాలు మానవుని మనుగడకు,
మనసు నిలువకుండా ఉండగలనా మరుమారు కలిసేవరకు,
నయనాలు చిన్నబోవువేమో నిలువకు ఆమె రాక,
మనసు ఉప్పొంగుతుంది కడాలిలా ప్రతి సారి ఆమెను తలచ,
ఎప్పుడా అని ఎదురుచూచే ఈ జ్ఞాని, అజ్ఞాని అవునో,
అందని ద్రాక్షవలె, అందునా ఇందునా కదలాడే,
నోరు మూగబోయే,
మనసు చలించిపోయే,
మాట వాలదాయే,
చనువు పులకించిపోయే,
అయ్యో, సమయం అయిపోయే,
అడుగు పడదాయే,
చూపు మారదాయే,
ఇంతలో ఆమె పయనం మొదలాయే,
మససు వదలక, మాట రాక, చూపు తిరగక, మతి బ్రమించిపోయే ఆమె పలుకతో,
ఎట్టి రాయైయను చలించెను ఆమె స్పర్శతో,
మరణానికి పుట్టుక వచ్చును ఆమె చూపుతో,
మూగవానికి మాట వచ్చును ఆమె పలుకలతో,
ఆమె అందం అందనిది, అందినా అది నిలువగలనా,
కాలం చెప్పెను కఠిన రహస్యం,
ఊగించు హృదయ మృదంగం మరుక్షణం,
ఇట్టే దొరకదు వజ్రం, ఎంతైనా కావలెను ఆత్మసంకల్పం,
అవకాశం ఆవలిన, సిద్దం కమ్ము మారుమారు కలయికకు ,
ఆకాక్షించు మనసున, కేంద్రీకరించు ఆలోచన,
అది అందని ద్రాక్ష కాదే, కోట్లయందున,
సడలించు నీ సంకల్పం, ఉవ్వెత్తున,
ప్రొంగి పోర్లేను ఉత్సాహం నివ్వెత్తున,
చాలించు ఈ కావ్యం ఈ రేయికి,
మగువకు, చూపించు నీ మనసు ఈ లేఖతో .....................................సతీష్ 

No comments:

Post a Comment